Jagan: సంక్రాంతి పండగ తర్వాత అధినేత జగన్ వరుస పర్యటనలు

Jagan: నేరుగా ప్రచార రంగంలోకి దిగనున్న సీఎం జగన్

Update: 2023-12-17 03:01 GMT

Jagan: సంక్రాంతి పండగ తర్వాత అధినేత జగన్ వరుస పర్యటనలు

Jagan: ఏపీ రాజకీయాలు రోజురోజుకీ ఇంట్రెస్టింగ్‌గా మారుతున్నాయి పెంచుతున్నాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీలన్నీ దూకుడు పెంచాయి. ఈ క్రమంలోనే సీఎం జగన్ సారధ్యంలోని అధికార వైసీపీ సైతం పక్కా వ్యూహాలను రచిస్తోంది. వై నాట్ 175 అంటూ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్ ఇప్పటికే 11 నియోజకవర్గాలకు కొత్తగా ఇంఛార్జ్‌లను కూడా ప్రకటించారు. దీంతో ఎవరు ఉంటారో ఎవరు ఊడతారో తెలియని అయోమయంలో పడ్డారు నేతలు. సీనియర్, జూనియన్ అనే డిఫరెన్స్ లేకుండా విక్టరీయే ఫస్ట్ ప్రయారిటీగా సీఎం జగన్ చేపట్టిన ఈ ప్రక్షాళన పార్టీ నేతలను కలవరపెడుతోంది.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ స్టార్ట్ అయింది. పెద్ద ఎత్తున సిట్టింగ్‌లను మార్చాలని సీఎం జగన్ ఇప్పటికే ప్లాన్ చేస్తుండడంతో ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది. టికెట్లు కేటాయించలేని నేతలకు, మార్పులు చేర్పులు జరిగే నేతలకు అధిష్టానం నుంచి ఫోన్లు వెళ‌్తున్నాయట. ఇందులో భాగంగానే డిసెంబర్ నెలాఖరు లోపు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలనే టార్గెట్‌తో వైసీపీ అధిష్టానం వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.CM జగన్: 

మరో వైపు ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాల్లో ప్రస్తుత సిట్టింగ్‌లను మార్చే ప్రక్రియను వైసీపీ హైకమాండ్ వేగవంతం చేసింది. సాధ్యమైనంత తొందరగా అభ్యర్థులను ప్రకటించి జనంలోకి పంపించాలని వైసీపీ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. ఒక్కొక్క జిల్లాలో ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల వడపోత కార్యక్రమం కొనసాగుతున్నట్లు టాక్. అయితే జనవరిలో అసంతృప్తులను కాంప్రమైజ్ చేసే ఆలోచనలో అధిష్టానం ఉంది. సంక్రాంతి పండగ తర్వాత నుంచి సీఎం జగన్ వరుస పర్యటనలు చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది. దీంతో కంప్లీట్‌గా ఎన్నికలపైనే వైసీపీ బాస్ ఫోకస్ పెట్టి ప్రచారంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News