నేడు చింతపల్లిలో సీఎం జగన్ పర్యటన
Jagan: ఏపీలో 10 రోజులపాటు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం
నేడు చింతపల్లిలో సీఎం జగన్ పర్యటన
Jagan: నేడు చింతపల్లిలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఏపీలో 10 రోజులపాటు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 4 లక్షల,34వేల,185 మందికి ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నారు. విద్యార్థులకు 620 కోట్ల వ్యయంతో ఉచితంగా... బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని చింతపల్లిలో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.