CM Jagan: ఇవాళ అన్నమయ్య జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

CM Jagan: మదనపల్లెలో నాలుగో విడత విద్యాదీవెన కార్యక్రమం

Update: 2022-11-30 03:09 GMT

CM Jagan: ఇవాళ అన్నమయ్య జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

CM Jagan: ఇవాళ అన్నమయ్య జిల్లాలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. మదనపల్లెలో నాలుగో విడత విద్యాదీవెన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. బటన్‌ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11లక్షల 6 వేల 243 మంది విద్యార్థులకు ఆర్థికసాయం అందించనున్నారు. 6 వందల 93 కోట్ల 79 లక్షల నగదును.. అర్హులైన 9 లక్షల 85 వేల 360 మంది తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్. అనంతరం.. మదనపల్లెలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగిస్తారు. గన్నవరం నుంచి తిరుపతికి ప్రత్యేక విమానంలో సీఎం జగన్‌ వెళ్లనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మదనపల్లెకు సీఎం జగన్‌ చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News