అందుకోసం ఎవరిచుట్టూ తిరగాల్సిన అవసరంలేదు : సీఎం జగన్

Update: 2019-08-17 01:35 GMT

ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి జగన్ స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రారంభమైన వాలంటీర్ వ్యవస్థపై ట్వీట్ చేశారు. 'గ్రామ స్వరాజ్యం దిశగా అడుగువేశాం. వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించాం. కనీస అవసరాలకోసం ప్రజలు ఎవరిచుట్టూ తిరగాల్సిన అవసరంలేదు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ బాధ్యత వహిస్తారు. సంక్షేమ పథకాలను డోర్‌డెలివరీ చేస్తారు. గ్రామ సచివాలయంతో అనుసంధానం చేసుకుని మీ సమస్యల్ని పరిష్కరిస్తారు.' అని పేర్కొన్నారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ని నియమిస్తారు. గ్రామ/వార్డు వాలంటీర్ కి నెలకు రూ.5వేలు గౌరవ వేతనం ఇస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటికే డోర్‌ డెలివరీ చేయడం లక్ష్యంగా గ్రామాలు, పట్టణాల్లో వాలంటీర్లను నియమించినట్టు సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News