ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం

Update: 2021-02-24 12:28 GMT

ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం

ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఏడు తరగతులకు సీబీఎస్ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. విద్యా విధానంపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది నుంచి సీబీఎస్ఈ విధానం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. తర్వాత తరగతులకు ఒక్కో ఏడాది అమలుకు నిర్ణయం తీసుకున్నారు.

విద్యాకానుకలో ఇంగ్లీష్-తెలుగు డిక్షనరీ చేర్చాలని సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఏడాదికి ఒక తరగతి చొప్పున 2024 నాటికి పదోతరగతి వరకు సీబీఎస్‌ఈసీ విధానం అమల్లోకి తేవాలని.. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠ్యపుస్తకాలు కూడా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అత్యంత నాణ్యతతో ఉండాలని ఆదేశించారు. ఉపాధ్యాయులకూ డిక్షనరీలు ఇవ్వాలని చెప్పారు. అమ్మఒడి పథకం కింద విద్యార్థులకు ఇచ్చే ల్యాప్‌టాప్‌ల నాణ్యత, సర్వీసు బాగుండాలన్నారు. 

Full View


Tags:    

Similar News