CM Jagan: మరో 19 నెలల్లో మళ్లీ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాం
CM Jagan: ప్రతి సచివాలయానికి రూ.20లక్షలు కేటాయిస్తున్నాం
CM Jagan: మరో 19 నెలల్లో మళ్లీ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాం
CM Jagan: 19 నెలల్లో మళ్లీ ఎన్నికలకు సన్నద్దం అవుతున్నామని సీఎం జగన్ అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. ప్రతి సచివాలయానికి 20లక్షల రూపాయలు ప్రాధాన్యత పనుల కోసం కేటాయిస్తున్నామన్నారు. సీఎంగా తాను ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండలేకపోవచ్చని ప్రతి ఎమ్మెల్యే కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని జగన్ సూచించారు. క్యాంపు కార్యాలయంలో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో జగన్ సమావేశం అయ్యారు.