రేపు సీఆర్డీఏపై ముఖ్యమంత్రి సమీక్ష.. ఆ వివరాలు బయటపెడతారా!

Update: 2019-08-28 01:40 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు(ఆగస్టు 29) సీఆర్డీఏపై సమీక్ష నిర్వహించనున్నారు. అమరావతిలో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. రేపు ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందోనన్న చర్చ మొదలైంది. అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. దీనికి బలం చేకూర్చే విధంగా ఇప్పటికే బీజేపీ నేత సుజనా చౌదరి బంధువులు రాజధాని అనౌన్స్ కాకముందు అక్కడ భూములు కొన్నారని మంత్రి బొత్స ప్రకటన చేశారు. అలాగే త్వరలో అందరి వివరాలు బయటపెడతామన్నారు. ఈ నేపథ్యంలో రేపు ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఇటీవల మంత్రి బొత్స చేసిన ప్రకటనతో రాజధానిలో అలజడి నెలకొంది. అమరావతికి చెందిన కొందరు రైతులు బొత్స మాటలను వ్యతిరేకిస్తున్నారు. 

Tags:    

Similar News