Jagan: కోవిడ్ అప్రమత్త చర్యలపై సమీక్ష.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Jagan: ముందస్తు చర్యలపై దృష్టి పెట్టాలన్న సీఎం జగన్‌

Update: 2023-12-22 09:10 GMT

Jagan: కోవిడ్ అప్రమత్త చర్యలపై సమీక్ష.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Jagan: కోవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌–1 విస్తరిస్తుందన్న సమాచారం నేపధ్యంలో ఏపీ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. జేఎన్‌–1 వేరియంట్‌పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఎలాంటి కాంప్లికేషన్స్‌ లేకుండానే ఈ కోవిడ్‌ వేరియంట్‌ సోకినవారు రికవరీ అవుతున్నారని అధికారులు జగన్‌కు వెల్లడించారు. ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే కోలుకుంటున్నారని తెలిపారు. డెల్టా వేరియంట్‌ తరహా లక్షణాలు లేవని తేల్చి చెప్పారు. ముందస్తు చర్యలపై దృష్టి పెట్టాలన్న సీఎం జగన్‌.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను, విలేజ్‌ క్లినిక్‌లను.. ముందస్తు చర్యలకు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. కొత్త వేరియెంట్‌ లక్షణాలు, తీసుకోవాల్సిన చర్యలపై..విలేజ్‌ క్లినిక్‌ స్టాఫ్‌కు అవగాహన కల్పించాలని సీఎం సూచించారు.

Tags:    

Similar News