పూర్తి స్థాయిలో అంచనా వేయండి : సీఎం జగన్‌

Update: 2019-08-20 07:36 GMT

ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్కడినుంచే అధికారులతో సమీక్షలు నిర్వహసిస్తున్నారు. కృష్ణానది వరదపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. వరద బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై ఆరాతీశారు. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లో కలిపి మొత్తం 33 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 4300 హెక్టార్లలో ఉద్యానవన పంటలు నీటమునిగాయి. వరద తాకిడి​కి 125 ఇళ్లు, 31 బోట్లు దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రికి అధికారులు నివేదించారు. ఇక దీనిపై పూర్తి స్థాయిలో అంచనా వెయ్యాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి త్వరితగతిన నష్ట నివేదికలు ఇవ్వాలని కోరారు. 

Tags:    

Similar News