Jagan: భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్

Jagan: ఎయిర్ పోర్టు త్రీడీ మోడల్‌ను పరిశీలించిన సీఎం జగన్

Update: 2023-05-03 05:44 GMT

Jagan: భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ 

Jagan: భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఎయిర్ పోర్టు త్రీడి మోడల్‌ను పరిశీలించారు. 2వేల203 ఎక‌రాల్లో భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరగనుంది. తొలిదశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణించేలా నిర్మాణం జరిపి... తర్వాత ఏటా 4 కోట్ల మంది ప్రయాణించేలా అభివృద్ధి చేయనున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంతో లక్షలాది మందికి ఉపాధి దొరకనుంది. భోగాపురం ఎయిర్ పోర్టుతో పాటు చింతపల్లి ఫిష్ లాండింగ్ సెంటర్‌, వైజాగ్ టెక్ పార్క్, డేటా సెంటర్, రిక్రియేషన్ సెంటర్లకు శంకుస్థాపనకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.

భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాకుండా రాష్ట్రంలోని వివిధ రంగాల్లో అభివృద్ధికి దోహదం చేయనుంది. 4 వేల 592 కోట్ల రూపాయల వ్యయంతో ఎయిర్ పోర్టు నిర్మాణం చేపట్టనున్నారు. ప‌నులు ప్రారంభించిన నాటి నుంచి గ‌రిష్టంగా మూడేళ్ల వ్యవ‌ధిలో నిర్మాణాన్ని పూర్తిచేసి ఎయిర్‌పోర్టు కార్యక‌లాపాల‌ను నిర్వహించనున్నారు. అయితే ప‌బ్లిక్ ప్రైవేట్ భాగ‌స్వామ్య విధానంలో GMR విశాఖ‌ప‌ట్నం ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ దీనిని నిర్మిస్తోంది.  

Tags:    

Similar News