YS Jagan: పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించిన సీఎం జగన్‌

Update: 2020-02-28 06:58 GMT
పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించిన సీఎం జగన్‌

ఏపీ సీఎం వైఎస్‌ జగన్ పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో జరుగుతున్న పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఆ తర్వాత పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షిస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్న సీఎం జగన్‌కు మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పేర్ని నాని, అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఆళ్ల నాని, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కొట్టు సత్యనారాయణ, తల్లారి వెంకట్రావు, దేవులపల్లి ధనలక్ష్మి, జీఎస్ నాయుడు, ముదునూరి ప్రసాదరాజు, పుప్పాల వాసుబాబు, ఎంపీలు మార్గాని భరత్, కోటగిరి శ్రీధర్‌, కలెక్టర్‌ ముత్యాల రాజు స్వాగతం పలికారు.

2021 చివరి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్న ప్రభుత్వం, పనులను వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు.

Tags:    

Similar News