CM Jagan: ఏపీ జెన్‌కో మూడో యూనిట్‌ను ప్రారంభించిన జగన్
CM Jagan: తన తండ్రి వైఎస్సార్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్టును ప్రారంభించడం ఆనందంగా ఉంది
CM Jagan: ఏపీ జెన్‌కో మూడో యూనిట్‌ను ప్రారంభించిన జగన్
CM Jagan: రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిలో మరో ముందడుగు పడిందని సీఎం జగన్ అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజానంతో నిర్మించిన జెన్‌కో మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేస్తున్నామన్నారు. తన తండ్రి వైఎస్సార్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్టును ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారాయన... కృష్ణపట్నం పోర్టు పరిధిలోని మత్స్యకారులు, మత్స్యకారేతరుల స్వప్నం సాకారమయిందన్నారు.
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటకూరులో ఏపీ జెన్‌కో మూడో యూనిట్‌ను ప్రారంభించిన సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. చేపల వేటకు అనువుగా 25 కోట్ల రూపాయల వ్యయంతో ఫిషింగ్ జెట్టి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.