CM Jagan: దత్తపుత్రుడు పార్టీని రౌడీసేనగా.. టీడీపీ అంటే తెలుగు బూతులు పార్టీగా మార్చేశారు
CM Jagan: చంద్రబాబు, దత్తపుత్రుడు కలిసి కుట్రలు చేస్తున్నారు
CM Jagan: దత్తపుత్రుడు పార్టీని రౌడీసేనగా.. టీడీపీ అంటే తెలుగు బూతులు పార్టీగా మార్చేశారు
CM Jagan: టీడీపీ, జనసేనపై సీఎం జగన్ ఫైరయ్యారు. దత్తపుత్రుడు పార్టీని రౌడీసేనగా.. టీడీపీ అంటే తెలుగు బూతులు పార్టీగా మార్చేశారని ఎద్దెవా చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బైబై చెప్పారని.. అయితే ఇవే తనకు చివరి ఎన్నికలంటూ చంద్రబాబు జనాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, దత్తపుత్రుడు కలిసి కుట్రలు చేస్తున్నారని.. ప్రశ్నిస్తానని చెప్పేవారు కూడా ప్రశ్నించడం లేదని సీఎం జగన్ ఆరోపించారు.
టీడీపీ, జనసేనపై సీఎం జగన్ ఫైరయ్యారు. టీడీపీని తెలుగు బూతుల పార్టీగా.. జనసేనను రౌడీసేనగా మార్చేశారని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్.. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బైబై చెప్పారన్నారు. అన్ని ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని.. చివరికి కుప్పంలో కూడా వైసీపీనే గెలిపించారని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో వారి పాలన చూసిన ప్రజలు.. ఇదేం కర్మరా బాబు అనుకునేవారని ఎద్దెవా చేశారు.
''టీడీపీని చిత్తుగా ఓడించి మరోసారి బైబై బాబు అని చెప్పారు. వాళ్ల పాలన చూసి ప్రజలు ఇదే కర్మరా బాబు అనుకున్నారు. అందుకే 2019లో వారికి ప్రజలు బైబై చెప్పారు'' అని సీఎం అన్నారు. ఏ మంచీ చేయని తనకు ఎవరైనా ఎందుకు ఓటు వేస్తారని బాబు చెప్పడు. చంద్రబాబు, దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5ను నమ్మొద్దు. మీకు మంచి జరిగిందా లేదా అనేది కొలమానంగా తీసుకోవాలని సీఎం జగన్ అన్నారు.