Chandrababu: నేడు దుబాయ్ పర్యటనకు సీఎం చంద్రబాబు..
Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు నుంచి మూడు రోజుల పాటు దుబాయ్‌లో పర్యటించనున్నారు.
Chandrababu: నేడు దుబాయ్ పర్యటనకు సీఎం చంద్రబాబు..
Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు నుంచి మూడు రోజుల పాటు దుబాయ్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తెచ్చే లక్ష్యంతో ఈ పర్యటనను పకడ్బందీగా ప్లాన్ చేశారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ప్రతిష్టాత్మక పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ విజయవంతం చేయడమే చంద్రబాబు ప్రధాన ఉద్దేశ్యం.
ఈ పర్యటనలో ఆయన మొత్తం 25 సమావేశాల్లో పాల్గొననున్నారు. వీటిలో 14 వన్-టు-వన్ మీటింగ్స్, 3 ప్రభుత్వ అధికారులతో సమావేశాలు, 2 సైట్ విజిట్స్, 2 మీడియా ఇంటర్వ్యూలు, సీఐఐ ఆధ్వర్యంలోని రోడ్‌షో, అలాగే ప్రవాస తెలుగు సమాజంతో సమావేశం ఉంటాయి.
నేడు చంద్రబాబు శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూధా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థల ప్రతినిధులను కలుసుకోనున్నారు. ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీ, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్, పోర్టులు వంటి రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై చర్చిస్తారు. అనంతరం ‘మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్’ను సందర్శించి, భవిష్యత్ టెక్నాలజీ సొల్యూషన్‌లను పరిశీలిస్తారు.
చివరి రోజున దుబాయ్‌లో ఏపీఎన్‌ఆర్టీ ఆధ్వర్యంలో జరిగే తెలుగు ప్రవాసుల సమావేశంలో పాల్గొని, రాష్ట్ర అభివృద్ధిలో వారి భాగస్వామ్యంపై సీఎం మాట్లాడనున్నారు. ఆయనతో పాటు మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధన్ రెడ్డి, సీఎస్ కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ సెక్రటరీ యువరాజ్, ఈడీబీ సీఈవో సాయికాంత్ వర్మ పాల్గొంటున్నారు.