Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావంపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

Cyclone Montha: ఏపీపై మొంథా తుఫాన్ ప్రభావంపై ఆర్టీజీఎస్ నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

Update: 2025-10-28 10:27 GMT

Cyclone Montha: ఏపీపై మొంథా తుఫాన్ ప్రభావంపై ఆర్టీజీఎస్ నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు లోకేష్, అనిత, నారాయణ, సీఎస్ విజయానంద్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం తుఫాన్ తీరానికి దగ్గరగా వస్తోందని.. కోస్తాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ప్రారంభమైందని అధికారులు వివరించారు.

కాకినాడ, మచిలీపట్నం, విశాఖ తీర ప్రాంతాల్లో వర్షాలు, గాలులు తీవ్రత ఎక్కువ ఉందని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. గతంలో వచ్చిన తుఫానుల నష్టాన్ని బేరీజు వేసుకొని తగిన చర్యలు తీసుకొవాలన్నారు. కాకినాడ, పరిసర ప్రాంతాలకు రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను పంపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 

Tags:    

Similar News