Chandrababu: అవరసమైతే ఎరువుల్ని డోర్ డెలివరీ చేద్ధాం
Chandrababu: ఎరువుల కొరత రానీకుండా చూడాలని సీఎం చంద్రబాబునాయుడు కలెక్టర్లకు సూచించారు.
Chandrababu: ఎరువుల కొరత రానీకుండా చూడాలని సీఎం చంద్రబాబునాయుడు కలెక్టర్లకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపుతున్న ఎరువుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్లో నమోదుచేయాలన్నారు. సీజన్ ఏదైనా సరే ఎరువుల కొరతరానీకుండా అందుబాటులో ఉండే విధంగాచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల ఆధార్ ధృవీకరణతోఎరువులను పంపిణీచేసే విధంగా చూడాలన్నారు. ఎరువులు అవసరమైతే రైతులకు డోర్ డెలివరీ చేద్ధామని సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో ప్రస్తావించారు.
రిజిస్ట్రేషన్ చేసుకోని ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ వర్తించదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రిజిస్ట్రేషన్ చేసుకోని వారికి ముప్పై రోజుల గడువు ఇస్తున్నామన్నారు. ఆ తర్వాత ఎవరైనా రిజిస్ట్రేషన్ లేకుండా ఉంటే పథకం వర్తించదని... ఒకవేళ ఎవరైనా లబ్ధి పొందినా వెంటనే తొలగిస్తామని హెచ్చరించారు.