CM Chandrababu: రెవెన్యూ, దేవాదాయ శాఖలపై సీఎం చంద్రబాబు అసంతృప్తి

CM Chandrababu: రెవెన్యూ, దేవాదాయ శాఖలపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Update: 2025-12-10 06:54 GMT

CM Chandrababu: రెవెన్యూ, దేవాదాయ శాఖలపై సీఎం చంద్రబాబు అసంతృప్తి

CM Chandrababu: రెవెన్యూ, దేవాదాయ శాఖలపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదన్నారు. రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారుల్లో నిబద్ధత లోపిస్తుందన్న సీఎం చంద్రబాబు.. వారిలో ఎన్ని సార్లు చెప్పినా ఎందుకు మార్పు రావడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రత్యేకంగా చర్చిస్తామన్నారు. ఇక కొన్ని శాఖలు ఎంత చెప్పినా గేర్ అప్ అవడం లేదన్న సీఎం..జనవరి 15 వరకు అన్ని శాఖల సర్వీసులు ఆన్‌లైన్‌లో ఉండాలని ఆదేశించారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలా చేస్తే ఏంటన్న ధోరణిలో పనిచేస్తామంటే కుదరదని.. ప్రజలకు పనికొచ్చేలా ఫలితం ఇచ్చే పనులు చేయాలని సూచించారు.

Tags:    

Similar News