వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ.. తీవ్రంగా గాయపడిన గ్రామ వలంటీర్
కడప జిల్లాలో వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో 11 మంది గాయపడ్డారు. చక్రాయపాలెం మండలం కుమారకాల్వ గ్రామంలో
కడప జిల్లాలో వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో 11 మంది గాయపడ్డారు. చక్రాయపాలెం మండలం కుమారకాల్వ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ చిన్న విషయం పెను వివాదమై ఇరు వర్గాల మధ్య ఒకరిపై ఒకరు రాళ్లు, కొడవళ్లతో దాడి చేసుకునేలా చేసింది. ఈ ఘటనలో గాయపడిన 11 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. గ్రామ వలంటీర్ తాళ్లపల్లె రాకేష్ (23) తీవ్రంగా గాయపడ్డారు, అలాగే రాకేష్ పెద్దనాన్న తాళ్లపల్లె జ్ఞానముత్తు (48 )పై వేట కొడవళ్లతో దాడి చేయడంతో ఆయన తలకు బలమైన గాయమైంది. వారిని వెంటనే కడపలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకొని అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. అనంతరం ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.