కృష్ణా జిల్లా మైలవరంలో నిర్వహించిన జగన్ ప్రచార సభలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. దీంతో పోలీసులపై వైసీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. పరిస్థితి చేయిదాటుతుందన్న కారణంతో వైసీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలువురికి గాయాలయ్యాయి. ఆ సమయంలో జగన్ మాట్లాడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా జగన్ నేడు గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.