డీలర్ల వద్దే నంబరు ప్లేట్ల బిగింపు

ఇక నుంచి చోదకుడు వాహనం ఏ డీలర్‌ వద్ద కొనుగోలు చేస్తాడో, అక్కడే హై సెక్యూరిటీ నంబరు ప్లేటును బిగించుకోవాలని రవాణాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేసారు.

Update: 2019-11-28 04:56 GMT
File Photo

విశాఖపట్నం: ఇక నుంచి చోదకుడు వాహనం ఏ డీలర్‌ వద్ద కొనుగోలు చేస్తాడో, అక్కడే హై సెక్యూరిటీ నంబరు ప్లేటును బిగించుకోవాలని రవాణాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారని డీటీసీ జి.సి.రాజారత్నం తెలియజేశారు. రవాణా కార్యాలయంలో వాహన డీలర్లతో ఆయన సమావేశమయ్యారు.

డీలర్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసి, నంబరు ప్లేటు బిగించి వాహనదారుడుకి అందజేయాలన్నారు. నంబరు ప్లేటుకు వాహన ధరలతో కలిపి చెల్లించాలని వాహనదారులకు సూచించారు. డీలరు, వాహనచోదకుడు నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.50 వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News