శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్
సీజేఐ హోదాలో చివరి రోజులను తిరుమలలో గడిపిన రంజన్ గొగోయ్
(తిరుమల, శ్యామ్ నాయుడు)
తిరుమల శ్రీవారిని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ దర్శించుకున్నారు...సీజేఐ హోదాలో చివరి పర్యటనగా నిన్న తిరుపతి వచ్చిన ఆయన నిన్న సాయంత్రం స్వామివారి సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు, రాత్రి అతిధిగృహంలో బస చేసి తిరిగి ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారి దర్శనానికి వెళ్లారు, ఈ సందర్భంగా టీటీడీ అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో సీజేఐ దంపతులకు మహాద్వారం వద్ద స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం చేయించారు, అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు సీజేఐ దంపతులకు ఆశీర్వచనం చేయగా, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ధర్మారెడ్డి శేషవస్త్రం కప్పి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు...అనంతరం అతిధిగృహం చేరుకున్న రంజన్ గొగోయ్ అల్పాహారం స్వీకరించిన తరువాత తిరుమల నుండి బయలుదేరి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.