Palanadu Accident: పల్నాడు రోడ్డు ప్రమాదంలో వీడిన మిస్టరీ.. జరిగింది ఇదే..!

Palanadu Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేట రోడ్డుప్రమాదంలో మిస్టరీ వీడింది.

Update: 2025-12-08 05:55 GMT

Palanadu Accident: పల్నాడు రోడ్డు ప్రమాదంలో వీడిన మిస్టరీ.. జరిగింది ఇదే..!

Palanadu Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేట రోడ్డుప్రమాదంలో మిస్టరీ వీడింది. ఈనెల 4న చిలకలూరిపేట బైపాస్‌లో కంటైనర్‌ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు మృతిచెందారు. ట్రాక్టర్ల లోడుతో వెళ్తోన్న కంటైనర్‌ను కారు అడ్డుపెట్టి ఆపడంతోనే కంటైనర్‌ను వెనుక నుంచి మరో కారు ఢీకొట్టింది. దీంతో ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు.

చిలకలూరిపేట హైవేపై కారు ఆపిన వ్యక్తిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. కంటైనర్‌ను ఆపిన వ్యక్తి నరసరావుపేట డీఎస్పీ ఆఫీస్‌లో పనిచేసే ఏఎస్‌ఐ కొడుకుగా గుర్తించారు. ఇతడు బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌గా అవతారం ఎత్తి హైవేపై అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని పోలీసులు గుర్తించి.. అతడి వల్లే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News