YS Jagan Birthday Wishes: జగన్ పుట్టిన రోజుకు చెవి రెడ్డి వినూత్నంగా విషెస్
ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్ తో ముఖచిత్రం తయారీ..2డి ఆర్కటెక్చర్ టెక్నాలజీతో రూపొందుతున్న జగన్ చిత్రం
జగన్ కు వినూత్నంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే విషెస్
Chevireddy Bhaskar Reddy - YS Jagan Birthday Wishes: సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విన్నూతన రీతిలో జగన్ కి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. రొటీన్ కు భిన్నంగా ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్ తో సీఎం జగన్ ముఖచిత్రం ఏర్పాటు చేశారు. వంద అడుగుల పొడవు, వెడల్పు తో 2d ఆర్కిటెక్చర్ టెక్నాలజీ తో సీఎం జగన్ ముఖచిత్రాన్ని రూపొందించారు. ఆర్టిస్ట్ కాంత్ రీషా దేశంలోనే తొలిసారిగా ఈ ఆర్ట్ ఫార్మింగ్ ను రూపొందంచారు.గత పదిరోజులుగా సీఎం క్యాంప్ కార్యాలయం దగ్గర ఎమ్మెల్యే చెవిరెడ్డి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. రేపు జగన్ కు ఈ బహుమతిని అందచేయనున్నారు.