Srisailam Temple: శ్రీశైలంలో మళ్లీ చార్టర్ ఫ్లైట్ కలకలం.. దర్యాప్తు మొదలు పెట్టిన ఆలయ సిబ్బంది
Srisailam Temple: శ్రీశైలం పరిసరాల్లో డ్రోన్లు తిరిగినా.. ఇప్పటివరకు దొరకని ఆచూకీ
Srisailam Temple: శ్రీశైలంలో మళ్లీ చార్టర్ ఫ్లైట్ కలకలం.. దర్యాప్తు మొదలు పెట్టిన ఆలయ సిబ్బంది
Srisailam Temple: శ్రీశైలం ఆలయం పరిసరాల్లో ఓ విమానం చక్కర్లు కొట్టింది. ఉదయం నుంచి ఆకాశంలో మూడు సార్లు చక్కర్లు కొట్టిందో విమానం. ఆలయ పరిసరాల్లో అక్కడికక్కడే ఆకాశంలో చక్కర్లు కొట్టడాన్ని గమనించిన స్దానికులు, భక్తులు భయాందోళనకు గురయ్యారు. గతంలో కూడా ఆలయ పరిసరాల్లో డ్రోన్లు చక్కర్లు కొట్టడం కలకలం రేగింది. ఆలయ పరిసరాల్లో డ్రోన్లు తిరిగినా... ఇంతవరకు పోలీసులు కానీ.. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది కానీ డ్రోన్లు ఎగుర వేసిన వ్యక్తులను పట్టుకోలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ శ్రీశైలంలో మూడు సార్లు ఆకాశంలో విమానం చక్కర్లు కొట్టడంపై భయాందోళనకు గురవుతున్నారు.