Chandrababu: నేడు విశాఖపట్నం జిల్లాలో చంద్రబాబు పర్యటన
Chandrababu: పాయకరావుపేట, గాజువాకలో ప్రజాగళం సభలు
Chandrababu: నేడు విశాఖపట్నం జిల్లాలో చంద్రబాబు పర్యటన
Chandrababu: ఏపీలో అధికారమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రజాగళం సభల్లో అధికార పక్షంపై తనదైన శైలీలో విమర్శలు గుప్పిస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే తాము ఏం చేస్తామని విషయాలను ప్రజలకు చెబుతున్నారు. రోజుకు రెండు సభలకు తగ్గకుండా చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ విశాఖపట్నం జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. పాయకరావు పేటతో పాటు గాజువాకలో నిర్వహించనున్న ప్రజాగళం సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. అక్కడి కూటమి అభ్యర్థుల తరపున చంద్రబాబు ప్రచారం చేస్తారు. చంద్రబాబు పర్యటనకు టీడీపీ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.