Chandrababu: గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన

Chandrababu: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న చంద్రబాబు

Update: 2023-12-08 03:00 GMT

Chandrababu: గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన

Chandrababu: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. తెనాలి, వేమూరు, రేపల్లె నియోజకవర్గాలలో చంద్రబాబు పర్యటించనున్నారు. వరద వల్ల నష్టపోయిన పంట పొలాలను చంద్రబాబు పరిశీలిస్తారు. తెనాలి మండలం నందివెలుగు, అమృతలూరు, తుర్పుపాలెం గ్రామం చెరుకుపల్లి మండలం, పాతనందయపాలెం గ్రామం కర్లపాలెం మండలాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు చంద్రబాబు. రైతులుతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. ఇవాళ రాత్రికి బాపట్లలోనే బస చేయనున్నారు.

Tags:    

Similar News