చంద్రబాబు చేతికి ఉంగరం.. ఉంగరం వెనుక ఉన్న అసలు రహస్యం చెప్పిన..

TDP Mini Mahanadu: రాజకీయాల్లో హుషారుగా కన్పించే టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాంశాల తోపాటు నాయకులకు, కార్యకర్తలకు ఆరోగ్యపాఠాలు బోధిస్తున్నారు.

Update: 2022-07-07 11:45 GMT

TDP Mini Mahanadu: రాజకీయాల్లో హుషారుగా కన్పించే టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాంశాల తోపాటు నాయకులకు, కార్యకర్తలకు ఆరోగ్యపాఠాలు బోధిస్తున్నారు. రాజకీయ సభల్లో పార్టీని పటిష్టం చేయాలని సూచించే చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు. మదనపల్లిలో జరిగిన మినీ మహానాడులో పాల్గొన్న ఆయన ఇవాళ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పార్టీ స్థితిగతులపై సమీక్షించారు. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమీక్ష జరుపుతున్న సమయంలో చంద్రబాబు తన రింగు మహిమ చెప్పారు. ప్రతి నాయకుడు, కార్యకర్త ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరోగ్య సూత్రాలతో హితోపదేశం చేశారు.

ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే స్మార్ట్ ఎలక్ట్రానిక్ రింగును ధరించిన చంద్రబాబు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. అందరిచూపు చంద్రబాబు వేసుకున్న రింగుపైనే పడింది. ఇంతకీ ఆ రింగు కథ కమామిషును స్వయంగా చంద్రబాబే నాయకులకు, కార్యకర్తలకు వివరించారు. అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీతో ఎప్పటికప్పుడు వ్యక్తిగత ఆరోగ్య నివేదికను ఇచ్చే ఎలక్ట్రానిక్ రింగుతో చాలా ప్రయోజనాలున్నాయన్నారు. గుండె కొట్టుకునే తీరు, రక్తపోటు, శరీరంలో ఉన్న ఫ్యాట్ హెచ్చుతగ్గుల శాతాన్ని ఎప్పటికప్పుడు గుర్తుచేస్తుందని తెలిపారు. ప్రతిఒక్కరూ స్మార్ట్ రింగు వేసుకోవాలని సూచించారు.

స్మార్ట్ రింగులో అమర్చిన ప్రత్యేక మైక్రోచిప్ టెక్నాలజీ అనుసంధానంతో పనిచేస్తుంది. ఆధునిక సాంకేతికతతో కూడిన రింగ్ లో మైక్రో చిప్ ఉండటంతోపాటు ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంటుంది. రింగు వేసుకుంటేచాలు మెలకువతో ఉన్నా, నిద్రపోతున్నా శరీరంలోని మార్పులతో సమగ్ర ఆరోగ్య నివేదిక ఇస్తుంది. మైక్రోచిప్‌తో కూడిన రింగుకు సంబంధించిన వివరాలను మొబైల్ ఫోన్లో యాప్ ద్వారా గానీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ద్వారా అవసమైన హెల్త్ డేటాను పొందే వెసులుబాటు కల్పించారు. ఎలక్ట్రానిక్ ‌ స్మార్ట్ రింగు సూచించే విధంగా ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు చక్కదిద్దుకోవచ్చు. హెచ్చుతగ్గులను బట్టి డాక్టర్‌ను సంప్రదించి వైద్య చికిత్సపొందేందుకు దోహదమవుతుందని చంద్రబాబు నాయుడు నాయకులు, కార్యకర్తలకు వివరించారు.

Tags:    

Similar News