చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ .. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చ

Andhra News: ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చ

Update: 2024-01-14 02:47 GMT

చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ .. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చ  

Andhra News: తెలుగుదేశం అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. ఉండవల్లిలో ఈ సమావేశం దాదాపు మూడున్నర గంటలపాటు సాగింది. ఈ సందర్భంగా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. TDP సూపర్‌ సిక్స్‌, జనసేన షణ్ముఖ వ్యూహం కలిపి మేనిఫెస్టోను రూపొందించనున్నట్లు సమాచారం. ఈ నెలలోనే మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు టీడీపీ, జనసేన వర్గాలు పేర్కొన్నాయి. భేటీలో భాగంగా వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలకు సంబంధించి సీట్ల సర్దుబాటు విషయమై ఇరువురు నేతలు చర్చించారు. తెలుగుదేశం - జనసేన పార్టీల్లో వైసీపీ నేతల చేరికలు, వారికి సీట్ల కేటాయింపు పైనా చర్చించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ప్రచార సభలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాల గురించి చర్చ జరిగింది.

Tags:    

Similar News