Chandrababu: గన్నవరం టీడీపీ కార్యాలయం పరిశీలించిన చంద్రబాబు

Chandrababu: వాడివేడిగా చంద్రబాబు గన్నవరం టూర్

Update: 2023-02-25 02:52 GMT

Chandrababu: గన్నవరం టీడీపీ కార్యాలయం పరిశీలించిన చంద్రబాబు

Chandrababu: గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై వంశీ అనుచరుల దాడి తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు గన్నవరం పర్యటన వాడి వేడిగా జరిగింది. చంద్రబాబు గన్నవరంలో చేసిన రాజకీయ విమర్శలు వైసీపీలో కాకపుట్టించాయి.మాజీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు గన్నవరం టూర్ ముగిసే వరకు పోలీసులు టెన్షన్ టెన్షన్ గా గడిపారు.

గన్నవరం టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ అనుచరుల దాడిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత ప్రసాదం పాడులో రామినేని ప్రసాద్ ఇంటికి వెళ్ళిన ఆయన ఆ తర్వాత దాడికి గురైన దోంతు చిన్నా ఇంటికి వెళ్లి పరామర్శించారు. అక్కడ నుంచి కాలి నడకనే గన్నవరం టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. వంశీ అనుచరుల దాడిలో ధ్వంసమైన టీడీపీ కార్యాలయం అంతా తిరిగి పరిశీలించారు. తగలబడిన కార్లను కూడా పరిశీలించి పార్టీ నాయకులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మొన్న గన్నవరం వద్దామనుకుంటే రానివ్వరా..? గన్నవరం ఏమైనా పాకిస్తానులో ఉందా..? అని పోలీసులను ప్రశ్నించారు. సీఐ క్రిస్టియన్ అని ఎఫ్ఐఆర్లో పేర్కొంటూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా పెడతారనీ ఎస్పీ తీరును ఖండించారు. అధికారంలోకి రాగానే తప్పు చేసిన అధికారులు, పోలీసుల మక్కెలి ఇరగ్గొడతామని ఘాటుగా కామెంట్ చేశారు. గన్నవరం ఎమ్మెల్యే వంశీ టార్గెట్ గా చంద్రబాబు విమర్శలు చేశారు. వంశీ పశువుల డాక్టర్ అని తనను గెలిపించిన వాళ్లనే కొట్టించాడన్నారు. గన్నవరంలో భయంకరమైన వాతావరణం క్రియేట్ చేశారనీ...ప్రజల్లో భయాన్ని సృష్టించారన్నారు. ఎందరో మహానుభావులు చరిత్ర సృష్టించిన ప్రాంతం గన్నవరమని అలాంటి గన్నవరంలో రౌడీయిజం చేస్తున్నారన్నారు

పోలీసులను పక్కన పెట్టి రండి.. ధైర్యం ఉంటే ముహుర్తం పెట్టండి చూసుకుందాం అని చంద్రబాబు సవాలు విసిరారు. కొందరు బుద్దిలేని పోలీసులు డ్యూటీలో ఉన్న అడ్వకేట్లను అదుపులోకి తీసుకున్నారని అన్నారు. చంద్రబాబు చూసుకుందాం అని వంశీని తనను రమ్మంటుమ్మడని మేం కొడితే చంద్రబాబు పైకి పోతాడని.. తను వంశీ జైలుకు పోతామని మాజీ మంత్రి కొడాలి నాని రీయక్ట్ అయ్యారు. చంద్రబాబు రెచ్చగొట్టే పని చేస్తున్నారని, టీడీపీ నేత పట్టాభి చుట్టూ రాజకీయాలు చేయాలని అనుకుంటున్నారని అన్నారు కొడాలి. చంద్రబాబు ఇలాంటి కామెంట్స్ చేయటం సరికాదన్నారు కొడాలి.

Tags:    

Similar News