Andhra Pradesh: ఏపీకి శుభవార్త.. రూ.567 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఆరోగ్య రంగానికి సంబంధించిన చివరి విడతగా రూ.567 కోట్ల గ్రాంటును కేంద్రం విడుదల చేసింది.

Update: 2026-01-13 13:17 GMT

Andhra Pradesh: ఏపీకి శుభవార్త.. రూ.567 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఆరోగ్య రంగానికి సంబంధించిన చివరి విడతగా రూ.567 కోట్ల గ్రాంటును కేంద్రం విడుదల చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.

గత 19 నెలల కాలంలోనే 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధుల్లో సుమారు 48 శాతం వరకు వినియోగం జరిగిందని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధుల వినియోగంలో గణనీయమైన పురోగతి కనిపించిందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ కృషికి ఇది కేంద్రం ఇచ్చిన గుర్తింపుగా ఆయన వ్యాఖ్యానించారు.

15వ ఆర్థిక సంఘం నిధులను పూర్తి స్థాయిలో పొందిన మూడవ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ నిధులు ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.

అమరావతిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో 2025–26 బడ్జెట్ వ్యయంపై సమగ్రంగా చర్చించామని మంత్రి వెల్లడించారు. మిగిలిన నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖతో వెంటనే చర్చలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కేంద్రం నుంచి పూర్తి స్థాయి సహకారం సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ఆరోగ్య రంగం మరింత ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News