తుని కోర్టులో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరు గౌరవభావాన్ని పెంపొందించుకోవాలని, రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలని న్యాయమూర్తులు ఉద్భవించారు.

Update: 2019-11-26 08:08 GMT
న్యాయవాదులు ఎస్. కృష్ణ శేఖర్, ఎస్.నాగేశ్వరరావు, సిహెచ్ విరమణ, ఐ.మధు బాబు తదితరులు

తుని:రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరు గౌరవభావాన్ని పెంపొందించుకోవాలని, రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలని న్యాయమూర్తులు ఉద్భవించారు. మంగళవారం తుని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో రాజ్యాంగ దినోత్సవం, వరకట్న వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను గుర్తెరిగి సమాజంలో తోటి వారికి సహాయ పడాలని న్యాయమూర్తులు ఎం.శ్రీధర్, వి. గౌరీ శంకర్ రావు పిలుపు నిచ్చారు. హక్కుల కోసం పోరాడే ముందు తమ బాధ్యతను కూడా తెలుసుకోవాలని సూచించారు. ప్రజలను చైతన్యపరిచి వారి బాధ్యతలను గుర్తు చేసేందుకు ఏడాది పాటు గ్రామాల్లో సదస్సులు సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఎస్. కృష్ణ శేఖర్, ఎస్.నాగేశ్వరరావు, సిహెచ్ విరమణ, ఐ.మధు బాబు, మూర్తి, పి.కరుణశ్రీ, లోవ రాజు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News