ఏపీలో ఇవాళ, రేపు సీఈసీ బృందం పర్యటన
AP: సీఈవో, సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో భేటీకానున్న ఈసీ
ఏపీలో ఇవాళ, రేపు సీఈసీ బృందం పర్యటన
AP: ఏపీలో ఇవాళ, రేపు సీఈసీ ప్రతినిధుల బృందం పర్యటించనుంది. సీఈవో, సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ అధికారులు భేటీకానున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సమీక్షించనున్నారు. ఎన్నికల సన్నద్ధతపై సీఈసీ అధికారులు దిశానిర్దేశం చేయనున్నారు. ఓటర్ జాబితా తయారీపై పలు సూచనలు చేయనున్నారు. ఇక.. ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు ముగ్గురు అధికారులు.