వివేకా హత్య కేసు.. అవినాష్ తండ్రికి మరోసారి CBI నోటీసులు
CBI Notice: వైఎస్ వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు ఇచ్చింది.
వివేకా హత్య కేసు.. అవినాష్ తండ్రికి మరోసారి CBI నోటీసులు
CBI Notice: వైఎస్ వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు ఇచ్చింది. CRPC 160 కింద సీబీఐ అధికారులు నోటీస్ ఇచ్చారు. నోటీసులో తేదీ, సమయాన్ని వెల్లడించలేదు. కడప సెంట్రల్ జైలు గెస్ట్‌హౌస్ లేదా.. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలన్నారు. ఈనెల 12లోపు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. గత నెల 23న విచారణకు రావాలని మొదటిసారి భాస్కర్ రెడ్డికి నోటీసులు ఇవ్వగా.. సమయం ఇవ్వాలని ఆయన కోరారు.