సీబీఐ కోర్టులో జగన్‌కు ఊరట

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది.

Update: 2019-11-25 02:51 GMT

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించింది. అధిక ఆస్తులు కలిగిన కేసులో ప్రతి శుక్రవారం విచారణకు హాజరు కావాలని గతంలో కోర్టు తెలిపింది. జగన్ ప్రతిపక్ష నేతగా సమయంలో ప్రతివారం ఈ కేసు విచారణ కోసం కోర్టు ముందు హాజరైయ్యారు.

అయితే ఎన్నికల్లో విజయం సాధించి సీఎం అయిన తర్వాత జగన్ పాలనా వ్యవహారాలతో తీరిక లేకుండా ఉన్నారు. కాగా.. దీంతో ప్రతి వారం న్యాయస్థానం ముందు హాజరు కావాలంటే ప్రభుత్వానికి 60 లక్షల రూపాయలు ఖర్చవుతుందని జగన్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును కోరారు.

సీబీఐ మాత్రం జగన్ సీఎంగా ఉన్నారు కాబట్టి సాక్షులను ప్రభావితం చేస్తారని వాదించింది. తొలుత  సీబీఐ వాదనలతో కోర్టు అంగీకరించింది. తర్వాత విచారణ వాయిదా వేసిన సీబీఐ కోర్టు. జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. సీఎంగా వైఎస్ జగన్ ఇక ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావడంపై గతంలో టీడీపీ, జనసేన విమర్శలు కురిపించాయి.  

Tags:    

Similar News