ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై క్యాట్ విచారణ.. సస్పెన్షన్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన క్యాట్

Update: 2020-02-14 07:10 GMT
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై క్యాట్ విచారణ

ఏపీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ పై క్యాట్‌లో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరపున దేశాయి ప్రకాశ్ రెడ్డి హాజరయ్యారు. డీజీ స్థాయి అధికారిని కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలా సస్పెండ్ చేస్తారని క్యాట్‌ ప్రశ్నించింది. సస్పెండ్ చేస్తే హోం శాఖకు తెలియజేశారా అని.. గతేడాది మే నుంచి ఆయనకు జీతం ఎందుకివ్వలేదంటూ ప్రశ్నించింది. అయితే సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం వారం సమయం అడగడంతో విచారణను ఈ నెల 24 కు వాయిదా వేసింది. అయితే సస్పెన్షన్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం గత వారం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఏబీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ సంస్థ నుంచి నిఘా పరికరాల కొనుగోలు చేశారని ప్రభుత్వం చెబుతోంది. తనపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌పై మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ క్యాట్‌ను ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్(సెంట్రల్ అప్పిలేట్ ట్రైబ్యూనల్)ను ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వం తనను సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధమని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. గతేడాది మే 31 నుంచి తనకు జీతం చెల్లించకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే తనపై సస్పెన్షన్ వేటు వేశారని ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌కు తెలిపారు.

 

Tags:    

Similar News