ఇండస్ ఆసుపత్రి ప్రమాదంపై కేసు నమోదు

Indus Hospital: యాక్సిడెంటల్ ఫైర్ గా కేసు నమోదు చేసిన పోలీసులు

Update: 2023-12-15 05:01 GMT

ఇండస్ ఆసుపత్రి ప్రమాదంపై కేసు నమోదు

Indus Hospital: విశాఖ ఇండస్ ఆసుపత్రి ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. యాక్సిడెంటల్ ఫైర్ గా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. ఈ ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యము కూడా ఉందని నివేదికలో తెలిపారు. ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఐదుగురు సభ్యుల కమిటీ కలెక్టర్ కు నివేదిక సమర్పించింది. ప్రమాదంలో చిక్కుకున్న 47 మందిలో 24 మందిని ఇప్పటికే డిశ్చార్జ్ చేశారు. మిగిలిన 23 మంది విశాఖలోని పలు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు.

ఇండస్‌ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంపై విశాఖ కలెక్టర్‌ మల్లికార్జున విచారణకు ఆదేశించారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాల మేరకు ఐదుగురు అధికారులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో RDO, DMHO, ఈస్ట్ ఏసీపీ, ఫైర్ అసిస్టెంట్ ఆఫీసర్, DCHS సభ్యులుగా ఉన్నారు. 24గంటల వ్యవధిలో నివేదిక అందజేయాలని కలెక్టర్‌ ఆదేశించారన్నారు. దీంతో విచారణ చేపట్టిన కమిటీ.. ఇండస్ ఆస్పత్రిని సందర్శించి, ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించి, కలెక్టర్ కు నివేదికను సమర్చింది. దీంతో క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్ ప్రకారం ఆసుపత్రిపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Tags:    

Similar News