ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు పై కేసు నమోదయింది. అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్ ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడెలపై ఐపీసీ 409 సెక్షన్ కింద, తనది కాని ప్రభుత్వ ఆస్తిని షోరూంలో ఉంచుకుని వినియోగిస్తున్న కోడెల శివరామ్‌పై ఐపీసీ 414 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
అసెంబ్లీకి చెందిన ఫర్నిచర్ కోడెల కుమారుడు శివరామ్‌కు చెందిన షోరూంలో వినియోగిస్తున్న తరుణంలో శుక్రవారం అసెంబ్లీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గుంటూరులోని షోరూమ్‌లో అసెంబ్లీ ఫర్నిచర్ కొంత ఉందని గుర్తించారు. ఈ నేపథ్యంలో తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా అసెంబ్లీలో భద్రత లేక తన క్యాంపు కార్యాలయాల్లో ఆ ఫర్నిచర్‌ను భద్రపరిచానని కోడెల శివప్రసాద్ చెప్పిన సంగతి తెలిసిందే.