రైళ్ల రద్దు పొడిగింపు
రైల్వే ప్రయాణికులకు విజ్ఞప్తి మరికొద్ది రోజులు ప్యాసింజర్ రైళ్లు రద్దు
గిద్దలూరు: రైల్వే ప్రయాణికులకు విజ్ఞప్తి మరికొద్ది రోజులు ప్యాసింజర్ రైళ్లు రద్దు. యశ్వంతపూర్-విజయవాడ ప్యాసింజరు (56503/04) రైళ్లను మరికొన్ని రోజుల పాటు రద్దుచేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. బయ్యపనహళ్లి స్టేషన్‌లో జరుగుతున్న యార్డు పనుల కారణంగా గతనెల 28నుంచి ఈనెల 7వ తేదీ వరకూ ఈ ప్యాసింజరు రైళ్లను రద్దు చేసి.. ఆ రైళ్లకు నెంబరు మార్చి ధర్మవరం-బెంగళూరు కంటోన్మెంటు మధ్య ప్రత్యేక రైళ్ల (నెం. 06521/ 22)ను ప్రారంభించిన సంగతి పాఠకులకు తెలిసిందే.
యార్డు పనులు పూర్తికాని కారణంగా ఈనెల 14వ తేదీ వరకూ యశ్వంతపూర్-విజయవాడ ప్యాసిం జరు స్థానంలో ధర్మవరం-బెంగళూరు కంటోన్మెంటు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలియజేశారు.