Vijayawada: ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి
Vijayawada: బస్సు చక్రాల కింద పడ్డ పలువురు ప్రయాణికులు రక్షించేందుకు అధికారులు చర్యలు...
Vijayawada: ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి
Vijayawada: విజయవాడ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్లాట్ ఫామ్ మీదకు బస్సు దూసుకురావడంతో ముగ్గురు మృతి చెందారు. ప్లాట్ ఫామ్ నెంబర్ 12 దగ్గర ప్రమాదం జరిగింది. బస్సు చక్రాల కింద పడ్డ ప్రయాణికులను రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రివర్స్ గేర్‌కు బదులు ఫస్ట్ గేర్ వేయడంతో ప్రమాదం జరిగిందంటున్నారు. ప్రమాదం జరిగిన బస్సు విజయవాడ నుండి గుంటూరు వెళ్లాల్సి ఉంది.