Botsa Satyanarayana: పేదలందరికీ ఇళ్లు పథకంపై హైకోర్టు తీర్పు బాధాకరం
Botsa Satyanarayana: పేదలందరికీ ఇళ్లు పథకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు బాధ కలిగించిందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.
Botsa Satyanarayana: పేదలందరికీ ఇళ్లు పథకంపై హైకోర్టు తీర్పు బాధాకరం
Botsa Satyanarayana: పేదలందరికీ ఇళ్లు పథకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు బాధ కలిగించిందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. దీనిపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపిన ఆయన.. ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టంగా వివరిస్తామన్నారు. టీడీపీ నేతలు సాంకేతిక అంశాల పేరుతో తమకున్న పరిచయాలు వాడుకుని సంక్షేమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు బొత్స. ఎన్ని ఒడిదుడుగులు ఎదురైనా ఇచ్చినా హామీలను నెరవేరుస్తామని మంత్రి బొత్స అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థం చేసింది చంద్రబాబే. గతంలో అధిక టారిఫ్‌లకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్లే విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాల్లో కూరుకున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం రూ.వేల కోట్ల బకాయిలను పెండింగ్‌లో పెట్టింది. ఆ బకాయిలన్నింటినీ మా ప్రభుత్వం చెల్లిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.