జమ్మలమడుగులో బాంబు కలకలం

Jammalamadugu: ముద్దునూరు రోడ్డులోని రియల్ ఎస్టేట్ స్థలంలో బయటపడ్డ బాంబు

Update: 2023-09-29 07:07 GMT

జమ్మలమడుగులో బాంబు కలకలం

Jammalamadugu:  కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో నాటు బాంబు కలకలం రేపింది. నాటుబాంబు లభ్యం కావడంతో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముద్దునూరు రోడ్డు పెన్నానది సమీపంలో గల ప్లాట్లల్లో బాంబు ఉందనే సమాచారంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో పెద్ద ఎత్తున నాటు బాంబులు దొరికినట్లు చెబుతున్నారు. ఇవాళ కూడా మరొక నాటు బాంబు ఇదే ప్రాంతంలో లభించడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. ఈ ప్రాంతంలో పేలుడు పదార్థాలపై తనిఖీలు చేస్తున్నారు.

Tags:    

Similar News