ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన సునీల్ దియోధర్
JanaSena, BJP Alliance: ఏపీలో పొత్తులపై బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దియోధర్ క్లారిటీ ఇచ్చారు.
ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన సునీల్ దియోధర్
JanaSena, BJP Alliance: ఏపీలో పొత్తులపై బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దియోధర్ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ- జనసేన కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. టీడీపీ కుటుంబ, అవినీతి పార్టీ అని టీడీపీతో తాము పొత్తు పెట్టుకోమన్నారు. గతంలో ఆపార్టీతో పొత్తుపెట్టుకొని చేదు అనుభవాలు చవిచూశామన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అడిగిన రోడ్ మ్యాప్‌పై అంతర్గంగా చర్చించుకుంటామన్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారాన్ని తాము సీరియస్‌గా తీసుకోవట్లేదన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. ఏపీలో ఓటు వేసిన ప్రజలకే వైసీపీ వెన్నుపోటు పొడుస్తోందని సునీల్ దియోధర్ విమర్శించారు.