R Krishnaiah: బీజేపీ అభ్యర్థిగా ఏపీ నుంచి రాజ్యసభకు ఆర్. కృష్ణయ్య..!

R Krishnaiah: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఆర్. కృష్ణయ్యను బీజేపీ ఎంపిక చేసింది.

Update: 2024-12-09 07:52 GMT

R Krishnaiah: బీజేపీ అభ్యర్ధిగా ఏపీ నుంచి రాజ్యసభకు ఆర్. కృష్ణయ్య..!

R Krishnaiah: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ స్థానాల పోలింగ్ కు నోటిఫికేషన్ విడుదలైంది. రేపే నామినేషన్ల దాఖలుకు చివరి తేది. ఏపీ అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం మేరకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మూడు స్థానాలు దక్కనున్నాయి.

ఆర్. కృష్ణయ్యతో బీజేపీ నాయకుల సంప్రదింపులు

కొంతకాలంగా బీజేపీ నాయకత్వం ఆర్. కృష్ణయ్యతో సంప్రదింపులు జరుపుతోందని ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూరేలా రాజ్యసభకు కృష్ణయ్య పేరును ఖరారు చేసింది కమలం పార్టీ. బీసీలకు బీజేపీ ప్రాధాన్యత ఇస్తోందని సంకేతాలు ఇవ్వడానికి ఆర్. కృష్ణయ్య ఆ పార్టీ రాజ్యసభకు పంపుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణకు చెందిన డాక్టర్ లక్ష్మణ్ కు ఆ పార్టీ కీలక పదవులు కట్టబెట్టింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ఆయన సభ్యుడిగా ఉన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

2014 లో ఎల్ బీ నగర్ ఎమ్మెల్యేగా

2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్. కృష్ణయ్యను ఎల్ బీ నగర్ నుంచి టీడీపీ బరిలోకి దింపింది. ఈ స్థానం నుంచి ఆయన అప్పట్లో గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆ ఎన్నికల్లో మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయనను వైఎస్ఆర్ సీపీ రాజ్యసభకు పంపింది. రెండేళ్ల పాటు ఆయన వైఎస్ఆర్ సీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. గత నెలలోనే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.

డిసెంబర్ 10 న నామినేషన్ దాఖలు చేయనున్న కృష్ణయ్య

రాజ్యసభ ఎన్నికల్లో ఆర్. కృష్ణయ్య డిసెంబర్ 10న నామినేషన్ దాఖలు చేయనున్నారు. డిసెంబర్ 9న ఆయన హైద్రాబాద్ నుంచి విజయవాడకు వెళ్లనున్నారు. ఏపీ రాష్ట్రంలోని మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు స్థానాల్లో టీడీపీ, ఒక స్థానంలో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. ఈ సారి జనసేనకు రాజ్యసభకు అవకాశం ఉండకపోవచ్చని చెబుతున్నారు.

Tags:    

Similar News