Nuzividu: సీఏఏ చట్టంపై బీజేపీ అవగాహన కార్యక్రమం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ చట్టంపై పట్టణంలో బీజేపీ నాయకులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Update: 2020-01-29 11:06 GMT

నూజివీడు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ చట్టంపై పట్టణంలో బీజేపీ నాయకులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవారం నూజివీడు కృష్ణా విలాస్ కాలనీలో పట్టణ బీజేపీ అధ్యక్షులు ఎం.రాజశేఖర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలనుంచి లక్షలాదిమంది అక్రమ చోరబాటుదారుల గుర్తించేందుకే సీఏఏ అమలు చేస్తున్నట్టు నాయకులు వివరించారు.

దేశంలో అశాంతి, అలజడులు సృష్టించేందుకు మైనార్టీ వర్గాల్లో లేనిపోనీ అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సీఏఏకు అనుకూలంగా 88662 88662 ఫోన్ నెంబర్ కి మిస్డ్ కాల్ చేయించారు. ఈ కార్యక్రమంలో సీఏఏ కోఆర్డినేషన్ కమిటీ ఇంచార్జ్ నూతక్కి వేణుగోపాలరావు, నియోజకవర్గ కన్వీనర్ బోను అప్పారావు, నూజివీడు, అగిరిపల్లి, చాట్రాయి మండల పార్టీ అధ్యక్షులు నక్కా శ్రీనివాసరావు, రంగారావు, బిళ్ళనేని రాజా పాల్గొన్నారు.


Tags:    

Similar News