ఘనంగా బ్రూస్ లీ జన్మదిన వేడుకలు

మార్షల్ ఆర్ట్స్ యోధుడు, బ్రూస్ లీ 80 వ జన్మదిన వేడుకలు మధురవాడ శిల్పారామంలో బుధవారం ఘనంగా జరిగాయి.

Update: 2019-11-27 10:40 GMT
తైక్వాండో ప్రధాన శిక్షకులు, సంఘ ఉపాధ్యక్షులు బి ఆనంద్ రావు మరియు క్రీడాకారులు

విశాఖపట్నం: మార్షల్ ఆర్ట్స్ యోధుడు, బ్రూస్ లీ 80 వ జన్మదిన వేడుకలు మధురవాడ శిల్పారామంలో బుధవారం ఘనంగా జరిగాయి.ఆనంద్ టైక్వాండో అండ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో ముందుగా బ్రూస్ లీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

మార్షల్ ఆర్ట్స్ కు ప్రపంచ ఖ్యాతి రావడానికి బ్రూస్ లీ పాత్రను తైక్వాండో ప్రధాన శిక్షకులు, రాష్ట్ర అమెచ్యూర్ తైక్వాండో సంఘ ఉపాధ్యక్షులు బి ఆనంద్ రావు క్రీడాకారులకు వివరించారు. బ్రూస్ లీ 34 ఏళ్లకే తనువు చాలించినప్పటికీ మార్షల్ ఆర్ట్స్ లో చిరస్థాయిగా తన పేరు సజీవంగా ఉండేలా ఆయన పలు మార్గదర్శకాలు చూపారన్నారు. యువ క్రీడాకారులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని ఆనంద్ పిలుపునిచ్చారు.



Tags:    

Similar News