Tirumala: భక్తులకు కర్రల పంపిణీ.. ట్రోల్స్‌పై స్పందించిన టీటీడీ ఛైర్మన్
Tirumala: చిరుత బోనులో చిక్కిన ప్రాంతాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి పరిశీలించారు.
Tirumala: భక్తులకు కర్రల పంపిణీ.. ట్రోల్స్‌పై స్పందించిన టీటీడీ ఛైర్మన్
Tirumala: చిరుత బోనులో చిక్కిన ప్రాంతాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి పరిశీలించారు. అటవీ ప్రాంతంలో 300 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. మరో 200 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. నూతన సాంకేతికతో బోనులను సైతం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ట్రాప్ కెమెరాల ఆధారంగా చిరుతల కదలికలను నిరంతరం గుర్తిస్తున్నామని చెప్పారు.
ఇక.. భక్తులకు కర్రలను పంపిణీ చేయడంపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై స్పందించారు చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. ఎత్తయిన జంతువులపై చిరుత దాడి చేసిన దాఖలాలు లేవని, చేతిలో కర్ర ఉంటే మనిషి మరింత ఎత్తు కనబడతాడని తద్వారా.. చిరుత దాడి చేసే అవకాశం ఉండదన్నారు చైర్మన్ భూమన. చర్యలు చేపట్టినప్పుడు అభినందించాల్సింది పోయి విమర్శలు చేసి, మనోబలాన్ని తగ్గించడం సబబు కాదని హెచ్చరించారు.