Bhumana Karunakar Reddy: చంద్రబాబు నీచ రాజకీయాలకు ఇది పరాకాష్ట.. బాబుకు స్వామివారే శిక్ష వేస్తారు..
Bhumana Karunakar Reddy: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై అసత్యపు ప్రచారాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానుకోవాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Bhumana Karunakar Reddy: చంద్రబాబు నీచ రాజకీయాలకు ఇది పరాకాష్ట.. బాబుకు స్వామివారే శిక్ష వేస్తారు..
Bhumana Karunakar Reddy: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై అసత్యపు ప్రచారాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానుకోవాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నీచ రాజకీయాలకు ఇది పరాకాష్ట అన్నారాయన... తిరుమల శ్రీవారి ప్రసాదం గురించి విష ప్రచారం చేసిన చంద్రబాబుకు స్వామి వారే వారికి శిక్ష విధిస్తారని హెచ్చరించారు.. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బదీసే విధంగా చేసిన ఇలాంటి విషప్రచారం చంద్రబాబుకు తగదన్నారు.
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల దృష్టి మరల్చడానికి ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు భూమన చంద్రబాబు జీవితం అంత విష ప్రచారం, నీచ రాజకీయాలు చేయడమేనన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.