విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణలు
Vijayawada: 5 రోజుల పాటు కొనసాగనున్న దీక్షా విరమణలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణలు
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఇవాళ్టి నుంచి భవానీ దీక్షా విరమణలు ప్రారంభంకానున్నాయి. దీక్ష విరమణల కోసం అర్చకులు అగ్ని ప్రతిష్టాపనల చేశారు అర్చకులు. ఐదు రోజుల పాటు ఈ భవానీ దీక్షల కార్యక్రమం కొనసాగనుంది. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు భవానీ దీక్షా విరమణలు, శత చండీయాగం నిర్వహణ, గిరి ప్రదక్షణ, దీక్ష విరమణలు జరగనున్నాయి. భవానీ దీక్షా విరమణలకు ఇంద్రకీలాద్రిపై అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.
ఇక మహామండపం దిగువన హోమ గుండాలతో పాటు గురు భవానీల సమక్షంలో ఇరుముడి విప్పేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. దీక్షా విరమణలకు ఈ ఐదు రోజుల్లో ఏడు లక్షల మంది భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తోన్నారు. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. కాగా ఈ నెల 7న మహా పూర్ణాహుతితో భవానీ దీక్షలు ముగియనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇంద్రకీలాద్రికి తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో కొండపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈ సందర్భంగా వాహనాల మళ్లింపును చేపట్టారు.