Ayurvedic Medicine: ఏపీలో కరోనాకు ఆయుర్వేద ఔషధం.. మందు కోసం కిలోమీటర్ల మేర క్యూ

Ayurvedic Medicine: రాయలసీమలో కరోనాకు ఆయుర్వేద మందు పంపిణీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

Update: 2021-05-18 07:42 GMT

Ayurvedic Medicine: ఏపీలో కరోనాకు ఆయుర్వేద ఔషధం.. మందు కోసం కిలోమీటర్ల మేర క్యూ

Ayurvedic Medicine: రాయలసీమలో కరోనాకు ఆయుర్వేద మందు పంపిణీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. దీని కోసం రాష్ట్రం నలుమూలల నుంచి కరోనా బాధితుల బంధువులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. కిలోమీటర్ల కొద్దీ లైన్లలో గంటల తరబడి నిలబడి మరీ ఈ ఉచిత కరోనా ఆయుర్వేద మందును తీసుకెళ్తున్నారు.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన డాక్టర్‌ ఆనందయ్య.. ఆయుర్వేదంతో ఓ మందు తయారుచేశాడు. కరోనాను నివారించేందుకు ఈ ఔషధం పనిచేస్తుందని చెబుతున్నాడు. కరోనా రాని వాళ్లు ఒకసారి, కరోనా బాధితులు మూడు డోసులు చొప్పున వేసుకుంటే వైరస్‌ ఇట్టే మాయమవుతుందని రమణయ్య అంటున్నాడు. ఇక.. ఈ విషయం తెలుసుకున్న జిల్లా, రాష్ట్ర ప్రజలు ఆయుర్వేద ఔషధం కోసం కృష్ణపట్నానికి పరుగులు తీస్తున్నారు.

ఇక.. ఈ విష‍యం తెలుసుకున్న జిల్లా అధికార యంత్రాంగం వివరాలు సేకరించింది. తక్షణమే ఆయుర్వేద ఔషధ పంపిణీని నిలిపివేయాలని హెచ్చరించింది. అయితే.. ఔషధ పంపిణీ నిలిపివేయడంతో జోక్యం చేసుకున్న ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. ఔషధ పంపిణీని కొనసాగించాలని జిల్లా కలెక్టర్‌కు మెమొరాండం ఇచ్చారు.

Full View


Tags:    

Similar News