స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ ప్రోగ్రాం పై విద్యార్థులకు అవగాహన

స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ ప్రోగ్రాం పై అవగాహన కార్యక్రమం పట్టణంలో గల స్థానిక ఎస్.ఆర్.ఆర్ బాయ్స్ ఉన్నత పాఠశాలలో జరిగింది.

Update: 2019-12-06 10:25 GMT
డిఎస్పి బి.శ్రీనివాసులు

నూజివీడు: స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ ప్రోగ్రాం పై అవగాహన కార్యక్రమం పట్టణంలో గల స్థానిక ఎస్.ఆర్.ఆర్ బాయ్స్ ఉన్నత పాఠశాలలో జరిగింది. డిఎస్పి బి.శ్రీనివాసులు యస్.పి.సి జిల్లా నోడల్ అధికారి అజీజ్ విద్యార్థులకు హెల్ప్ నెంబర్ ల గూర్చి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డి.ఎస్.పి బి. శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులకు100, 108 హెల్ప్లైన్ నెంబర్ల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. రామచంద్ర రావు, ఎస్సైలు శ్రీనివాసరావు, కె.ఎం.వి సత్యనారాయణ, పాఠశాల హెడ్మాస్టర్ మదన్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. 



Tags:    

Similar News